కొమురవెల్లిలో శ్రావణమాస సందడి

  • మల్లన్న నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగం

కొమురవెల్లి, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో శ్రావణమాస సందడి నెలకొంది. మల్లికార్జునస్వామి టెంపుల్ కు భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. గంగిరేగు చెట్టు వద్ద పట్నం వేసి బోనం సమర్పించారు. .

స్వామివారిని దర్శించుకొని అభిషేకం, అర్చనలు చేయించుకున్నారు. అనంతరం మల్లన్న గుట్టపై ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, ఓగ్గు పూజారులు పర్యవేక్షించి భక్తులకు సేవలందిచారు.