అగ్నిపర్వతాలు పేలితే ఎక్కడైనా భగభగ మండే లావా పొంగుకొస్తుంది. భారీ ఎత్తున మంటలొస్తయి. కిలోమీటర్ల ఎత్తుకు బూడిద, పొగలు లేస్తాయి. కానీ ఈ వోల్కనో పేలితే బురద మట్టి పొంగుకొచ్చింది. పెద్ద ఎత్తున గ్యాస్ వచ్చి మంటలు లేచాయి. లావా మాత్రం రాలేదు. ఆదివారం రాత్రి అజర్ బైజన్ లోని కాస్పియన్ సముద్రంలో ఆయిల్, గ్యాస్ ఫీల్డ్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అయితే ఇది లావా ఉండే వోల్కనో కాదు. బురద వోల్కనో. భూమి లోపలి పొరలో ఒత్తిడి ఏర్పడి, పైభాగంలో ఫాల్ట్ ఉన్నచోట ఇలా వోల్కనోలు పేలి బురదను ఎగజిమ్ముతాయట.
