పెండింగ్‌‌‌‌‌‌‌‌లో భూముల సర్వే..ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లావ్యాప్తంగా వేల అప్లికేషన్లు 

  • సర్వేయర్ల కొరత వల్లే అప్లికేషన్లు పరిష్కారం కావట్లే.. 
  • చలాన్లు కట్టి ఎదురుచూస్తున్న రైతులు
  • ఉన్న సర్వేయర్లు ఇతర భూసేకరణ పనుల్లో బిజీ 

కాల్వశ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం కునారం గ్రామానికి చెందిన ఓ రైతుకు 1.37 ఎకరాల భూమి ఉంది. హద్దులు సరిగా లేకపోవడంతో చుట్టుపక్కల రైతులతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని,  మే 29న మీసేవాలో  రూ.1410  చలాన్‌‌‌‌‌‌‌‌ కట్టి సంబంధిత అధికారులకు ఇచ్చారు. 45 రోజుల్లోనే సర్వే చేసి హద్దులు చూపాల్సి ఉండగా.. 7 నెలలైనా సర్వే చేయలేదు. తన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినా ఫలితం లేదని బాధిత రైతు చెబుతున్నారు. 

పెద్దపల్లి, వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లావ్యాప్తంగా భూముల సర్వే లేటవుతోంది. రైతులు తమ భూముల సర్వే కోసం పెట్టుకున్న అప్లికేషన్లు వేల సంఖ్యలో ఉన్నాయి. సర్వే డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో సిబ్బంది కొరత వల్లే పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్న సిబ్బంది కూడా జిల్లాల్లో  వివిధ అభివృద్ధి పనుల కోసం జరుగుతున్న భూసేకరణలో నిమగ్నమయ్యారు. దీంతో రైతులు తమ వ్యక్తిగత సమస్యల కోసం భూసర్వే నిర్వహించాలని చలాన్లు కట్టి నెలలపాటు ఎదురుచూడాల్సి వస్తోంది. 

సర్వేయర్ల కొరతే ప్రధాన సమస్య

పెద్దపల్లి జిల్లాలో 14 మండలాలకు 10 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. అలాగే కరీంనగర్​16 మండలాలకు 14, రాజన్న సిరిసిల్ల 12 మండలాలకు 7, జగిత్యాల 21 మండలాలకు 12మంది సర్వేయర్లు ఉన్నారు. దీంతో సర్వే డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంటు ద్వారా భూములకు హద్దులు ఏర్పాటు చేసుకోవడానికి చలాన్లు కట్టిన రైతులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. మీసేవా కేంద్రాల నుంచి సంబంధిత తహసీల్దార్లకు అప్లికేషన్లు చేరుతున్నా.. వాటికి పరిష్కారం దొరకడం లేదు.

Also Read :- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త మెనూ సంబురం

ఏడాది కాలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం లేకపోయినా, భూసేకరణ లాంటి అదనపు బాధ్యతలతో భూముల సర్వే లేటవుతోందని కొందరు అధికారులు చెబుతున్నారు.  సర్వేల్లో ఎక్కువగా ఆస్తుల పంపకాలకు సంబంధించిన హద్దుల ఏర్పాటు, గెట్టు తగాదాల టైంలో తప్పకుండా భూసర్వే అవసరం చేయాల్సి ఉంటోంది. 

అదనపు బాధ్యతల్లో సిబ్బంది 

చెరువుల రక్షణ కోసం సర్కార్​ హైడ్రా తరహా పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో జిల్లాల్లో ఉన్న టాస్క్​ఫోర్స్​ మొత్తం చెరువుల ఆక్రమణపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో ఉన్న సర్వేయర్లను చాలావరకు ఈ ఆక్రమణల కొలతలు తీసే పనుల్లో పడ్డారు. చెరువుల సర్వేకు రెవెన్యూ, ఇరిగేషన్​, సర్వే డిపార్ట్​మెంట్​, రికార్డుల శాఖకు సంబంధించిన అధికారులతో టాస్క్​ఫోర్స్​ కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ సర్వే డిపార్ట్​మెంట్​ పూర్తి స్థాయిలో కొలతలు తీసుకొని హద్దులు నిర్ణయిస్తేనే పని పూర్తవుతుంది.

 గొలుసులతో సర్వే చేసిన కాలంలో కూడా ఇన్ని దరఖాస్తులు పెండింగ్​ ఉండేవి కావు, ప్రస్తుతం డిజిటల్​జీపీఎస్‌‌‌‌‌‌‌‌, లైడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వే సిస్టం  వచ్చిన్పటికీ వేల సంఖ్యలో అప్లికేషన్లు పెండింగ్​లో ఉంటున్నాయి. ఇదిలా ఉంటే  సరిపోయే సిబ్బందిని ఏర్పాటు చేయడానికి,  వెంటనే సర్కార్​ సర్వేయర్ల నియామకం చేపడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.