ట్రిపుల్ ఆర్ భూసేకరణపై స్పీడప్.. మెప్పించి.. ఒప్పించి రైతులకు పరిహారం!

  • మెప్పించి.. ఒప్పించి రైతులకు పరిహారం!
  • ట్రిపుల్ ఆర్ భూ సేకరణపై స్పీడ్ పెంచిన యాదాద్రి జిల్లా ఆఫీసర్లు
  • సీఎం రేవంత్ ఆదేశాల మేరకురైతులను కలిసి చర్చలు 
  • 1, 800 ఎకరాల కోసం ముమ్మర చర్యలు
  • ఎకరానికి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షలపైనే చెల్లింపు
  •  ఇప్పటికే రెండు గ్రామాల పరిధిలో చర్చలు పూర్తి

యాదాద్రి, వెలుగు:రీజినల్​ రింగ్ ​రోడ్డు (ట్రిపుల్​ఆర్) ఉత్తర భాగంలో భూ సేకరణ స్పీడప్ అయింది. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో యాదాద్రి జిల్లా ఆఫీసర్లు భూములు కోల్పోయే రైతులతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే తుర్కపల్లి పరిధిలో రెండు గ్రామాల రైతులతో చర్చించారు.

మెరుగైన పరిహారం ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు రైతులకు స్పష్టం చేశారు. మిగిలిన గ్రామాల రైతులతోనూ చర్చించనున్నారు. భారత్​మాల ప్రాజెక్ట్ ఫేజ్1లో భాగంగా ట్రిపుల్​ఆర్ ను నిర్మిస్తున్నారు. ఉత్తర భాగమైన మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో 164 కి. మీ నిర్మించనున్న విషయం తెలిసిందే.

యాదాద్రి జిల్లాలోని ఐదు మండలాల్లోని 24  గ్రామాల్లో 59 కి.మీ నిర్మాణానికి1,800 ఎకరాలకు పైగా సేకరించాల్సి ఉండగా రైతులు భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు.

దీంతో  భూములు కోల్పోయే రైతులకు మానవతా దృక్పథంతో ‘అవార్డు’ మంచిగా ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్​రెడ్డి తాజాగా ఆదేశించిన విషయం తెలిసిందే. 

దీంతో జిల్లా కలెక్టర్​హనుమంతరావు క్షేత్రస్థాయికి వెళ్లి బాధిత రైతులతో నేరుగా మాట్లాడుతు న్నారు. ముందుగా తుర్కపల్లి మండలంలోనే ట్రిపుల్​ఆర్​ప్రారంభమవుతుండగా అక్కడి రైతులతో చర్చించారు. 

రాయగిరిలో రూ. 70 లక్షలకుపైగా..

భువనగిరి మండలంలో196 ఎకరాలను సేకరించాల్సి ఉండగా..  రాయగిరిలో  105 ఎకరాలకు చెందిన రైతులు వ్యతిరేకిస్తున్నారు. సర్వే నంబర్ 215తో పాటు  పలు సర్వే నంబర్లలో ఎకరానికి రూ. 13.12 లక్షలు, సర్వే నంబర్ 379తో పాటు మిగతా నంబర్లలో రూ. 29.40 లక్షలు ఉంది. 

సర్వే నంబర్ 682 తో పాటు పలు నంబర్లలో రూ. 36.75 లక్షల వరకు రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ ఉంది. బహిరంగ మార్కెట్ ఎకరానికి రూ. కోట్లలో పలుకుతోంది. అయితే.. రిజిస్ట్రేషన్​వ్యాల్యూను బట్టి రూ. 50 లక్షల నుంచి రూ. 70 లక్షలకుపైగా గ్రామానికి చెందిన రైతులకు అందించేందు కు చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు చెప్తుండ డమే కాకుండా ప్రపోజల్స్​ రెడీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఎకరానికి రూ. 30 లక్షలకు ఓకే

తుర్కపల్లి మండలం కోనాపురం, ఇబ్రహీంపూర్​లో 38 ఎకరాలకు చెందిన రైతులను  కలెక్టర్​తో పాటు అడిషనల్ ​కలెక్టర్​  కలిసి మాట్లాడారు. బహిరంగ మార్కెట్​లో ఎకరానికి రూ. కోటి ఉందని, తమకు కనీసం రూ. 50 లక్షలు అయినా ఇవ్వాలని రైతులు కోరారు. 

నేషనల్​హైవే రూల్స్​మేరకు ఇక్కడ రిజిస్ట్రేషన్​వ్యాల్యూకు మూడు రెట్లు మాత్రమే పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చూస్తే ఎకరానికి రూ. 19 లక్షలే వస్తుందని రైతులకు అధికారులు సూచించారు. 

అయినా రూ. 30 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పా రు. దీంతో రైతులు సానుకూలత వ్యక్తం చేశారని ఆఫీసర్లు తెలిపా రు. మిగిలిన 22 గ్రామాల రైతులతోనూ మాట్లాడుతామని చెప్పారు.