వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం

వనపర్తి, వెలుగు: పట్టణంలోని శంకర్​గంజ్ లో ఉన్న  లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కల్యాణం ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కల్యాణానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. అనంతరం తీర్థ, అన్నప్రసాద వితరణ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో తల్లిదండ్రులు వెంకటమ్మ, సాయిరె డ్డి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు  ప్రారంభించారు. పాలిటెక్నిక్​ కాలేజీలో మార్నింగ్​వాకర్స్​లో మాట్లాడారు.

రాత్రి సమయంలో చీకటిగా ఉంటుందని పట్టణ వాసులు పేర్కొనడంతో స్పందించిన ఎమ్మెల్యే హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేశ్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, పట్టణ కాంగ్రెస్​అధ్యక్షుడు చీర్ల చందర్, మున్సిపల్ కౌన్సిలర్లు సాగర్, బ్రహ్మం చారి, పట్టణ ప్రముఖ వైద్యులు పగిడాల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.