లేడీ ఎస్సై సూసైడ్.. రూంలో నోట్ స్వాధీనం

లేడీ ఎస్సై సూసైడ్.. రూంలో నోట్ స్వాధీనం
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కొత్త సంవత్సరం వేళ ఓ మహిళా ఎస్సై సూసైడ్ చేసుకొని చనిపోయింది. బులంద్‌షహర్ జిల్లాలోని అనుప్‌షహర్ పోలీస్ స్టేషన్‌‌లో ఎస్సైగా పనిచేస్తున్న మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ అర్జూ పవార్ (30) తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘అనుప్‌షహర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న అర్జూ పవార్ షామ్లీ పట్టణానికి చెందింది. ఆమె 2015 సంవత్సరానికి చెందిన ఎస్ఐ. ఆమే శుక్రవారం రాత్రి తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది. గమనించిన ఇంటి యజమాని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అర్జూ చనిపోయిన రూంను వీడియో తీశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అర్జూ రూంలో సూసైడ్ నోట్ లభించింది. తన చావుకు తానే బాధ్యురాలినని.. తన పనుల వల్లే తనకు ఈ గతి పట్టింది అని ఆమే తన నోట్‌లో పేర్కొంది. అర్జూ మృతి గురించి ఆమె కుటుంబసభ్యులకు తెలియజేశాం’ అని బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పి సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. For More News.. దేశవ్యాప్తంగా మొదలైన వ్యాక్సిన్ డ్రైరన్ తొమ్మిది నెలల తర్వాత తెరుచుకున్న స్కూల్స్ వీసాలపై నిషేధాన్ని పొడిగించిన ట్రంప్