ఈ మహిళా బాస్ చాలా స్పెషల్

ఈ మహిళా బాస్ చాలా స్పెషల్
  • ఈమె కంపెనీలో మహిళా ఉద్యోగినులకు ఎన్నో ఆప్షన్స్

  •  కరోనాకు ముందు నుంచే వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం

  • ఉద్యోగాన్ని వీలుని బట్టి పార్ట్ టైం.. ఫుల్ టైం గా మార్చుకునే వెసులుబాటు

నచ్చిన పనేదో చేసుకుంటూ పోదాం. రిస్క్​ అయినా సరే’ అనుకునే ఆడవాళ్లు చాలా తక్కువ. అనుకుని అడుగేసినా ఆటంకాలెన్నో ఉంటాయి. వాటన్నింటినీ దాటగలిగితేనే మహిళలు సక్సెస్​ అవుతారు. అలా సక్సెస్​ అయిన ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) ఎంట్రప్రెన్యూర్​ కోమల్​ శర్మ తల్వార్​. ఆమె అప్పటికే ఉన్న రంగాల్లోకి పోయి పోటీ పడదలుచుకోలేదు. తానే కొత్త రంగంలోకి అడుగుపెట్టి మార్గదర్శిగా నిలిచింది. ఇంటలెక్చువల్​ ప్రాపర్టీ (మేధో సంపత్తి) సర్వీస్​లు అందించే టెక్నో లీగల్​ డాక్యుమెంటేషన్​ సర్వీస్​ స్టార్ట్​ చేసింది. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ బేస్డ్​​గా ‘ఎక్స్​ఎల్​పాట్​’ స్టార్టప్​ని స్టార్ట్​ చేసింది. ఎకనామిక్స్​లో గ్రాడ్యుయేట్ అయిన కోమల్​ పెళ్లయిన తర్వాత లా కోర్స్​ పూర్తి చేసింది. లా చదివిన తర్వాత.. ఆరేళ్ల క్రితం ఈ ఎక్స్​ఎల్​పాట్​ స్టార్ట్​ చేసింది. మొదలైనప్పుడు ఒక్క ఉద్యోగి ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు ఒక మల్టీ నేషనల్​ కంపెనీగా ఎదిగింది. అయిదేళ్ల కిందట వరల్డ్​ ఎకనామిక్​ ఫోరమ్​​ సభ్యురాలిగా పనిచేసింది. ఆటోమేషన్​ ఇంటెలిజెన్స్​ ద్వారా ఇంటలెక్చువల్​ ప్రాపర్టీ సేవలు అందించే కోమల్​ తల్వార్​ నాలుగేళ్ల క్రితం ఆటోమేషన్​ టెక్నాలజీతో టెక్నాలజీ అనలిటిక్స్​ సర్వీస్​ని కూడా మొదలు పెట్టింది. కోమల్ తల్వార్​ ఎన్నోదేశాల్లోని క్లయింట్స్​తో బిజినెస్​ చేస్తోంది. బిజినెస్​లో వేలాది మందిని కలవాలి. దానికోసం ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది మహిళలకు సాధ్యమయ్యే పనేనా అనుకుంటారు.  కానీ, తనకు ఎలాంటి అడ్డంకులు ఈ కెరీర్​లో ఎదురు కాలేందంటోంది కోమల్​. వివక్షనూ ఎదుర్కోలేదని అంటోంది. ‘నేను కలిసే వాళ్లలో ఆడవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. కారణం ఆడవాళ్లకు అవకాశాలు తక్కువగా ఉండటమే’ అంటుంది కోమల్​. ‘ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకుని మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని అనుకున్నా అందుకోసం ఇతర కంపెనీలకు డిఫరెంట్​గా నా కంపెనీ నిర్వహిస్తున్నా”అంటోంది.  తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాలంటే ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదని, ఆ పరిస్థితులు లేకుండా చేయాలని తన కంపెనీని ఒక రోల్​ మోడల్​గా మార్చింది. కోమల్ తల్వార్​కి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వాళ్లను చూసుకుంటూ ఉద్యోగం చేసేందుకు ఆఫీసులోనే ఆ ఇద్దరు పిల్లలకి ఒక గదిని కేటాయించింది. పిల్లలకు డైపర్స్​ మార్చడానికి, వాళ్లకు ఫుడ్​ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. వాళ్లు కొద్దిగా ఎదిగిన తర్వాత అక్కడే చదువుకు ఏర్పాటు కూడా చేసింది. కానీ, పిల్లల బాధ్యత కోసమని బిజినెస్​ని వదులుకోలేదు. ఇది ఓనర్​గా తనకు ఉండే సౌకర్యం. మరి ఉద్యోగులకు ఉండదు కదా. అప్పుడు వాళ్ల పరిస్థితి ఏమిటి? ఉద్యోగాలు మానేయాలా? అనుకున్నది కోమల్. ఏ ఒక్క మహిళా ప్రసవం కోసం, పిల్లల్ని చూసుకోవడం కోసం ఉద్యోగమే మానేయాల్సి రాకూడదనుకుంది. పిల్లల్ని చూసుకునే తల్లులు అవసరాన్ని బట్టి ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించింది. అది కూడా అవసరాన్ని బట్టి జాబ్​ని పార్ట్​ టైమ్​, ఫుల్​ టైమ్​ గా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇలాంటి ఆప్షన్స్​ ఉంటేనే మహిళలు పనిలోకి రావడానికి, ఎదగడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతోందామె. చెప్పినట్లే తన కంపెనీలో 30 శాతం మంది ఆడవాళ్లు పని చేస్తున్నారట.  ఏ బిజినెస్​ చేయాలన్నా నెట్​వర్క్​ ఉండాలి. ‘ఈ నెట్​వర్క్​ని ఏర్పరుచుకోవడంలో మగవాళ్లకు ఉన్నన్ని అవకాశాలు ఆడవాళ్లకు లేవు. ఈ అడ్డంకిని బ్రేక్​ చేయకుండా ముందుకు పోలేమ’ని కోమల్​ అంటోంది. ఆడవాళ్లు ఎదగాలంటే.. ‘ముందు మనం ఆత్మ విశ్వాసం పెంచుకోవాలి. ఎదుగుదలకు మనం చేస్తున్న పనులు, ఉత్పత్పులనే నమ్ముకోవాలి’ అంటుంది కోమల్.