జనసేన ఆఫీస్ ఎదుట మహిళా అఘోరి బైఠాయింపు : పవన్ కల్యాణ్ ను కలవాలంటూ నిరసన

 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరి.. మంగళగిరి  జనసేన కార్యాలయం ఎదుట హల్​చల్​ చేశారు.  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిసిన తర్వాత వెళ్తానంటూ రహదారిపై పైన బైఠాటాయించడంతో..  ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. చేతిలో త్రిశూలం పట్టుకుని వచ్చి పోయే వారిని  బెదిరింపులకు గురిచేసింది. పోలీసులు పక్కనే ఉన్నా వారి మాటలను బేఖాతర్ చేస్తూ ఆమెకు నచ్చినట్లు రభస చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సమస్యల పరిష్కారం కోసంప్రజలు ధర్నా చేసిన విధంగా మహిళా అఘోరి మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుట పవన్​ కళ్యాణ్​ రావాలి అంటూ నినాదాలు చేసింది. పవన్​కళ్యాణ్​ను కలిసిన తరువాతే ఇక్కడి నుంచి కదులుతానని పేర్కొంది.   ఈ ఘటనను వీడియో తీస్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసింది. అఘోరి రోడ్డుపై బైఠాయించడం వలన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.  కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న అఘోరి.. గతంలో శ్రీకాళహస్తి దేవాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.