సుల్తానాబాద్, వెలుగు: సహజంగా మహిళలు నాట్లు వేయడం ఎప్పటినుంచో చూస్తున్నాం..కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి వస్తున్న కూలీలు పెద్దపల్లి జిల్లాలో ఎక్కడ చూసినా పొలాల్లో వరి నాట్లు వేస్తూ కనిపిస్తున్నారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున తీసుకుంటూ 15 మంది బృందంగా పని చేస్తూ రోజూ 5 ఎకరాల్లో నాట్లు వేస్తున్నారు.
ఇలా ఇప్పటికే దాదాపు 3 వేల మంది ఇతర రాష్ట్రాల కూలీలు జిల్లాకు చేరుకున్నట్టు సమాచారం. స్థానికంగా కూలీల కొరత ఉండడంతో పాటు అక్కడి కూలీలు వేగంగా వరినాట్లు వేస్తుండడంతో వారి వైపు మొగ్గు చూపుతున్నామని రైతులు తెలిపారు.