వ్యవసాయ కూలీ రేట్లు పెంచాలి : ఎం. ఆంజనేయులు

వనపర్తి టౌన్, వెలుగు: పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. ఆంజనేయులు డిమాండ్  చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో    తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం  జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల నుంచి గత ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీ రేట్లు పెంచకుండా, జీవో నంబర్  48ని సవరించకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు.

ప్రభుత్వం స్పందించి వ్యవసాయ కూలీలకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా జోన్ల వారీగా కూలీ రేట్లను పెంచుతూ జీవో జారీ చేయాలని కోరారు. ఎస్.రాజు, అజయ్, దేవన్న, బి రాజు పాల్గొన్నారు.