నవంబర్ 10న ల్యాబ్​ టెక్నీషియన్ గ్రేడ్​2 ఎగ్జామ్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నవంబర్ 10న ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II  రిక్రూట్మెంట్ పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ మెడికల్ అండ్‌‌ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంతరెడ్డి వెల్లడించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.20 వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అభ్యర్థులను పరీక్ష హాల్లో రిపోర్ట్ చేయాలని,2.45 గంటలకు గేటు మూసేస్తామని స్పష్టం చేశారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించబోమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్‌లో ఇబ్బందుంటే 74169 08215కి కాల్ చేయవచ్చన్నారు. అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, ఇంక్, టాటూలు వేసుకోవద్దని సూచించారు.