ముగిసిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

చిన్న చింతకుంట, వెలుగు: మహబూబ్ నగర్  జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో వెలిసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి అలంకరించిన ఆభరణాలను తొలగించారు. ఆలయ అర్చకులు స్వామి వారి ఆభరణాలను దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించారు. 

అనంతరం ఆభరణాలను వనపర్తి జిల్లా ఆత్మకూరు ఎస్​బీఐ బ్రాంచ్​కు తరలించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్  గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి, కమిటీ సభ్యులు, ఎస్ఐ ఆర్  శేఖర్  పాల్గొన్నారు.