ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా : కుంభం శివకుమార్ రెడ్డి

నారాయణపేట, వెలుగు: ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని డీసీసీ మాజీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్​చార్జి కుంభం శివకుమార్​రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ధర్నా కేంద్రం వద్దకు ఆయన వచ్చి సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలపై అవగహన ఉందని, త్వరలోనే సమగ్ర శిక్ష ఉద్యోగులు శుభవార్త వింటారన్నారు. స్థానికుడిగా ఉద్యోగుల సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టే సంఘీబావం తెలుపుతున్నానన్నారు.

కార్యక్రమంలో పేట మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ, కాంగ్రెస్ నాయకులు గందే చంద్రకాంత్, సంతోష్ కుమార్, నరహరి, సతీశ్ గౌడ్, కోట్ల రవీందర్ రెడ్డి, మారుతి, సునీల్ కుమార్ పాల్గొన్నారు. అలాగే, సమ్మెకు టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కిరణ్, పీడీఎస్​యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్, జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహా, జిల్లా ఉపాధ్యక్షుడు ఎదురింటి నర్సింహా, టీపీటీఎఫ్​ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప, జిల్లా సభ్యులు ఉసేనప్ప మద్దతు పలికారు. 

రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలి

నారాయణపేట: సీఎం కప్​ టోర్నమెంట్​లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చాలని మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్​ రెడ్డి విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం 240 మంది క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్సులను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, కౌన్సిలర్ సలీం, డైరెక్టర్ శరణప్ప, కాంగ్రెస్ నాయకులు గాజుల శివకుమార్, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోట్ల రవీందర్ రెడ్డి, డీవైఎస్​వో, పీఈటీలు పాల్గొన్నారు.