కేసుల విషయం నేను చూసుకుంటా.. టెన్షన్ అవసరం లేదు: కార్యకర్తలతో కేటీఆర్

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులు మనకు సమస్య కాదని.. 2001లో పార్టీ పెట్టినప్పటికంటే ఈ కష్టాలు పెద్దవి కావని అన్నారు. కేసుల విషయం తాను చూసుకుంటానని, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఫార్ములా ఈ రేసు కేసుపై స్పందిస్తూ.. ‘‘ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నాం..  ఈ కేసులు పెద్ద విషయం కాదు. కేసు విషయం నేను చూసుకుంటా.. ఆందోళన అవసరం లేదు. తప్పు చెయ్యనప్పుడు ఎవ్వరికీ భయపడనవసరం లేదు. లొట్టపీసు కేసు.. ఆయనో  లొట్టపీసు ముఖ్యమంత్రి. ఎవ్వరికీ భయపడే పనిలేదు. సావు నోట్లో తలపెట్టి.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా చెప్తున్న.. ఎవ్వరికీ భయపడేది లేదు. అర్ధ రూపాయి అవినీతి కూడా చేయలేదు.హైదరాబాద్ ను, తెలంగాణను ప్రపంచ చిత్రపటంలో ఉంచడానికే ప్రయత్నించాం. ఒక్క రూపాయి అవినీతి జరగలేదు’’ అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.

ALSO READ | అల్లు అర్జున్ విడుదలలో మా తప్పు లేదు: జైల్ డీజీ సౌమ్య మిశ్రా

 

పోరాటనామ సంవత్సరంగా కొట్లాడుదాం:

కొత్త సంవ్సరంలో  పోరాటనామ సంవత్సరంగా కొట్లాడుదామని కార్యకర్తలకు పిలుపనిచ్చారు కేసీఆర్. ‘‘ కేసులపై ఎవరికీ ఆందోళన అవసరం లేదు. కేసుల విషయం నేను చూసుకుంటా.. సమస్యలపైన ప్రభుత్వంపైన మీరు కొట్లాడండి. ఉద్యోగులకు రైతు బంధు ఇస్తలేరు. ఎకరాకు 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పి రూ.12 వేలు ఇస్తామంటున్నరు. పెన్షనర్లకు పెన్షన్లు ఎగ్గొట్టినరు. వీటిపైన పోరాడుదాం. రూ.4 వేల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న అవ్వ, అయ్యల కోసం కొట్లాడుదాం. మహాలక్ష్మీ పథకం కోసం ఎదురు చూస్తున్న ఆడబిడ్డల గురించి మాట్లాడదం. అంతేకానీ కేసులు.. ఏదో అయిపోతుందన్న ఆందోళన అవసరం లేదు. కాంగ్రెస్ నాయకులు అప్పుల పేరిట తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం తో అప్పు అయ్యిందని అంటున్నారు. మేడిగడ్డకు పర్రె వచ్చిందన్నారు. కానీ పెద్ద భూకంపాన్ని తట్టుకొని నిలబడింది.’’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో 3డీ పాలన నడుస్తోంది :

రాష్ట్రంలో 3D పాలన నడుస్తోందని కేటీఆర్ అన్నారు. ‘‘ రాష్ట్రంలో 3డీ పాలన నడుస్తోంది. 3డీ అంటే.. డిసెప్షన్, డిస్ట్రాక్షన్, డిస్ట్రక్షన్. అంటే మోసం, డైవర్ట్ చేయడం, విధ్వంసం చేయడం. అంతకు మించి రాష్ట్రంలో పాలనే లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండేది అనే సీఎం ఉండటం మన ఖర్మ’’ అని అసహనం వ్యక్తం చేశారు. 

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది:

కార్యకర్తలు, నాయకులు ఎలాంటి ఆందోళన అవసరం లేకుండా పార్టీ నిర్మాణం చేసుకొని ప్రభుత్వంపై కొట్లాడాలని పిలుపినిచ్చారు కేటీఆర్. ‘‘వార్డు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసుకుందాం..
కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. మీరు మా దగ్గరికి రావడం కాదు.. మేమే మీ దగ్గరకు వస్తం. జిల్లాల్లోనే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం. 60 లక్షల కుటుంబ సభ్యులున్న పార్టీని కాపాడుకుందం. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పనిచేద్దాం.ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా కొట్లాడుదాం..ప్రభుత్వంపై జనాల్లో కొట్లాడుదాం. న్యాయ పోరాటం చేద్దాం.’’ అని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.