Formula E Car Race Case : పైసా అవినీతి చేయలేదు.. రేవంత్ ఇంట్లో చర్చకు సిద్ధం: కేటీఆర్

ఈ ఫార్ములా రేస్ కేసులో పైసా అవినీతి చేయలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్.  సీఎం రేవంత్ రెడ్డి తన  జూబ్లీహిల్స్ లోని ఇంట్లో చర్చ పెట్టినా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు కేటీఆర్. అసెంబ్లీలో చర్చ పెట్టమంటే పారిపోయారని విమర్శించారు.  చట్టంపై  గౌరవం ఉందన్నారు. ఈడీ విచారణకు హాజరవుతానని చెప్పారు కేటీఆర్. సుప్రీంకోర్టులో న్యాయపరంగా కొట్లాడుతానని చెప్పారు. తనపైన పెట్టిన కేసు లొట్టపీస్ కేసని అన్నారు కేటీఆర్..ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు.

ALSO READ | కేటీఆర్ అరెస్టుకు లైన్ క్లియర్! క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.. హాట్ టాపిక్గా మారిన ఫార్ములా ఈ కేసు

అవినీతిలో కూరుకుపోయిన వారికి ప్రతి విషయం అవినీతిగానే కనిపిస్తుంది. నా మీద ఏం లేదు.. ఇదొక లొట్టపీసు కేసు.  అక్రమ కేసులు పెడితే రాజ్యాంగ బద్ధంగా తన హక్కులు కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేశాను.  చట్టాన్ని గౌరవిస్తూ ఏసీబీ ఆఫీసుకు వెళ్లాను.. కానీ లాయర్లకు అనుమతి లేదంటే బయటకు వచ్చేశా. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని సుప్రీం కోర్టుకు వెళ్తున్నా.. తప్పేముంది.?.  అరపైస అవినీతి కూడా జరగలేదు. తెలంగాణ ఇమేజ్ ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు.. హైద్రాబాద్ చిత్రపటాన్ని ప్రపంచంలో నిలబెట్టేందుకు ప్రయత్నం చేశాం. కాంగ్రెస్ నేతల్లాగా నికృష్టమైన ఆలోచనలేదు.  ఏ విచారణకైనా వస్తా.. లాయర్లను అనుమతిస్తే అటెండ్ అవుతా. ఈడీ విచారణకు కూడా వెళ్తా. ముమ్మాటికి తప్పు చేయలేదు.. ఏ విచారణ అయినా ఎదుర్కోవడానికి సిద్ధం.  అవినీతి లేని విషయంపై కాంగ్రెస్ నేతలు శునకానందం పొందుతున్నారు.  సీఎం నోట్లో నుంచి వచ్చేవి భగవత్  గీత సూక్తులు కావు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ALSO READ | ఫార్ములా ఈ కేసు.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేటీఆర్

మేం రైతు భరోసా కోసం పోరాడుతున్నాం. సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. డిస్ట్రక్షన్,  డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సీఎం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.  ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది.  ప్రభుత్వాన్ని నిలదీద్దాం. కేసు విషయంలో పోరాడుదాం.. ఆందోళన చెందకండి. మీడియా ఆగం కావొద్దు.. హైడ్రా బాధితులు, రైతు భరోసా తదితర అంశాలపై ఫోకస్ చేయాలి. మీడియా నిజం చూపించాలి . కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంగా బీజేపీ ఉంది. ఎవరు ఏ టీమో.. బీ టీమో తెలియదు.  పొంగులేటి,  మెగా కృష్ణారెడ్డి కొడంగల్ ప్రాజెక్టును పంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి మెగా భారీగా పార్టీ ఫండ్ ఇచ్చింది. క్విడ్ ప్రోకో అంటే సమ్మతమేనా?  ఎలక్టోరల్ బాండ్స్ ఒక్క బీఆర్ఎస్ కే ఇచ్చారా.  మా మీదనే ఎందుకు ఏడుస్తరు.  లీకు వీరుడు చెప్పంగనే మేము రాస్తం అన్నట్లు మీడియా ప్రవర్తించవద్దు అని అన్నారు కేటీఆర్.  

ALSO READ | Formula E Car Race Case: కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు

మంత్రులు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు అంత ఉలికి పాటు దేనికి. మెగా ఇంజినీరింగ్ మాకు కూడా డొనేషన్లు ఇచ్చింది.  కాంగ్రెస్ కు ఇచ్చింది.. అందుకే ప్రభుత్వం కొడంగల్ ప్రాజెక్టు ఇచ్చినట్లా? . సుంకిశాల కూలిన తర్వాత హెచ్ హెండబ్ల్యూఎస్ రిపోర్ట్ ఇచ్చింది. మెగా ను బ్యాన్ చేయాలన్న మీరు  ఎందుకు చేయడం లేదు.  ఏడాది నుంచి టైమ్ పాస్ నడుస్తుంది. కాసేపు కాళేశ్వరం.. కాసేపు జన్వాడ ఫాం హౌజ్, కాసేపు హైడ్రా.. ఈ రకంగా డైవర్షనే నడుస్తుంది.  కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. మాపై కేసులు ఇది ఆరంభం మాత్రమే.. నాలుగేండ్లలో చాలా జరుగుతాయి.. ఎదుర్కొంటాం అని కేటీఆర్ అన్నారు.