కడ్తాల్లో కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ఆమనగల్లు, వెలుగు : ట్రిబుల్ ఆర్, రేడియల్, గ్రీన్  ఫీల్డ్  రోడ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, కల్వకుర్తి  ఎమ్మెల్యే  కసిరెడ్డి నారాయణరెడ్డిపై బీఆర్ఎస్​ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం కడ్తాల్ లో కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సీఎంపై బీఆర్ఎస్  నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. 

ట్రిపుల్​ ఆర్  దక్షిణ భాగం అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా ఉండాలని సీఎం కోరుకుంటున్నారని చెప్పారు. న్యూ సిటీ, ఫోర్త్  సిటీ కోసం కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చని, అంతమాత్రాన ప్రభుత్వంపై బురద చల్లడం సిగ్గు చేటన్నారు.  భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని దక్షిణ అలైన్ మెంట్ లో మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. 

ఇప్పటికైనా బీఆర్ఎస్  నాయకులు అసత్య ఆరోపణలు మానుకొని రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బిచ్చ నాయక్, హనుమ నాయక్, జహంగీర్  బాబా, వెంకటేశ్, రాంచందర్  నాయక్ పాల్గొన్నారు.