ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక మలుపు.. హైకోర్టుకు కేటీఆర్..

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ లంచ్ మోషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై ఏసీబీ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో A1గా మాజీ మంత్రి కేటీఆర్ పేరును చేర్చారు. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసే ఉద్దేశంతో లంచ్ మోషన్ దాఖలు చేయాలని కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పై FIR నమోదు కావడంతో క్వాష్ పిటిషన్‌ వేసేందుకు అవకాశం ఉంది. న్యాయ నిపుణులతో చర్చలు జరిపాకే కేటీఆర్‌ క్వాష్ పిటిషన్ దాఖలు చేసే దిశగా ముందుకెళుతున్నారు. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని క్వాష్ పిటిషన్లో కేటీఆర్ కోరే అవకాశం ఉంది.

  • హైకోర్టులో లంచ్ మోషన్  పిటిషన్ ను మెన్షన్ చేసిన KTR న్యాయవాది
  • జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్ లో మెన్షన్ చేసిన KTR న్యాయవాది
  • సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు వెళ్లిన KTR న్యాయవాది 
  • ఈ బెంచ్ లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదని తెలిపిన ACB కౌన్సిల్ 
  • దీంతో చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ మెన్షన్ KTR న్యాయవాదులు
  • లంచ్ మోషన్ పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశం
  • మధ్యాహ్నం 2:15 కు హైకోర్టులో విచారణ ఉండే అవకాశం

ఫార్ములా–ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదు కావడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకున్నట్టయింది. ఆయనను ఏ1గా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ని ఏ2గా ఎఫ్ఐఆర్లో  పేర్కొంది ఏసీబీ. వీళ్లకు తర్వలోనే నోటీసులు అందించి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ పేర్కొంది. ఈ వివాదంలో ఏ3గా అప్పటి హెచ్ఎండీఏ చిఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. దీంతో పాటు ఓ ప్రైవేటు కంపెనీపైనా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల్లో ఈ కేసులో కీలకమైన వ్యక్తులను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేటీఆర్పై నమోదైన FIRలోని కీలక అంశాలు ఇవే:
* FIR నెంబర్12/ RCO- CIU- ACB 2024
* పీసీ యాక్ట్, ఐపిసి యాక్ట్ కింద కేసులు నమోదు
*13(1)(A)13(2)PC Act, 409, 120B IPC సెక్షన్స్ కింద కేసు నమోదు
* బుధవారం(డిసెంబర్ 18, 2024) సాయంత్రం 5:30కు ఏసీబీకి ఫిర్యాదు అందింది
*  ఫిర్యాదు చేసిన గవర్నర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి దాన కిషోర్
* ఆయన ఫిర్యాదు మేరకు A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు
* ప్రభుత్వం విచారణ చేయగా బయటపడ్డ అవకతవకలు
* ప్రభుత్వ నిధులు రూ.54 కోట్ల 88లక్షల 87వేల 043 రూపాయల అక్రమ బదిలీలు
* యూకేకి చెందిన FEO ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ కంపెనీ
* రెండు విడతల్లో చెల్లింపు.. మొదట 3/10/2023న రూ.22కోట్ల 69లక్షల 63వేల125
* రెండవ విడత 11/10/2023న 23కోట్ల 01 లక్షల 97వేల 500 బదిలీ
* హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి బదిలీ
* విదేశీ కంపెనీకీ చెల్లింపులతో HMDAకు అదనపు పన్ను భారం
* 8 కోట్ల 6 లక్షల 75వేల 404 రూపాయల అదనపు పన్ను భారం పడింది
* రూ.10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్ధిక శాఖ అనుమతి అవసరం
* సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్కు స్పాన్సర్స్ లేకపోవడంతో HMDA నిధులను దారి మళ్లించిన వైనం