ఫార్ములా ఈ రేసు కేసు : ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు

హైదరాబాద్: ఫార్ములా ఈ కారు రేసు కేసులో.. ఏసీబీ విచారణకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. తన హయాంలో హైదరాబాద్ సిటీలో ఫార్ములా ఈ కారు రేసు నిర్వహణ విషయంలో.. నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకు చెల్లించిన వ్యవహారంలో.. ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. 2025, జనవరి 6వ తేదీన ఏసీబీ ఆఫీసులో విచారణకు కేటీఆర్ వెళ్లారు. జనవరి 7న కేటీఆర్ ఇదే కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.

* నందినగర్ నివాసం నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్
* అంతకంటే ముందే నందినగర్ ఇంట్లో లీగల్ టీమ్తో కేటీఆర్ భేటీ
* కేటీఆర్ వెంట బీఆర్ఎస్ లీగల్ టీమ్
* కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
* లాయర్లు ఎవరూ కేటీఆర్ వెంట వెళ్లొద్దని అడ్డుకున్న పోలీసులు
* బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు
* విచారణలో కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న ఏసీబీ
* తనతో పాటు లాయర్ను విచారణకు అనుమతించాలన్న కేటీఆర్
* లాయర్తో కలిసి ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్
* కేటీఆర్ ను ఒక్కరినే విచారణకు అనుమతిస్తామన్న పోలీసులు

ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో మనీలాండరింగ్ కు సంబంధించి దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఇదే కేసులో నిందితులైన బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. తమకు మరికొంత సమయం కావాలని కోరడంతో ఈడీ వాళ్లకు మళ్లీ నోటీసులిచ్చింది. 

ఈ నెల 8న బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని, 9న అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హాజరుకావాలని ఆదేశించింది. అయితే కేటీఆర్ కూడా వాళ్లలాగే సమయం అడుగుతారా? లేక ఈడీ విచారణకు హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.