హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ప్రాజెక్టులోకి పవర్ స్టేషన్ ద్వారా నీటి తరలింపు విషయంపై ఆగమేఘాల మీద లెటర్ రాసిన కేఆర్ఎంబీ.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏపీ నీళ్లు తరలిస్తుంటే మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. ఎలాంటి రిలీజ్ ఆర్డర్ లేకుండానే నీటిని తరలిస్తున్నా కట్టడి చేయడానికి బోర్డు నుంచి స్పందన రాలేదు.డిపార్ట్ మెంట్ రీ ఆర్గనైజేషన్ గొడవలో తలమునకలైన తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కూడా నీటి తరలింపుపై కంప్లైంట్ చేయలేదు. సోమవారం సాయంత్రం నీటి తరలింపును మొదలు పెట్టి న ఏపీ అధికారులు మంగళవారం ఔట్ ఫ్లోను 400 క్యూసెక్కులకు పెంచారు. 8 టీఎంసీల నీటిని తరలిస్తా మని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కేఆర్ఎంబీకి మంగళవారం లెటర్ రాశారు.
