కృష్ణా బోర్డు వైజాగ్​కు తరలించేందుకు రెడీ

కృష్ణా బోర్డు వైజాగ్​కు తరలించేందుకు రెడీ
కృష్ణా బోర్డును వైజాగ్​కు తరలించేందుకు రెడీ కేంద్రానికి కేఆర్​ఎంబీ లెటర్ హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణా బోర్డు హెడ్‌‌ క్వార్టర్స్‌‌ను వైజాగ్‌‌కు తరలించేందుకు కేఆర్‌‌ఎంబీ ఓకే చెప్పింది. ఈ మేరకు కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ హరికేశ్‌‌ మీనా గురువారం జలశక్తి శాఖ సీనియర్‌‌ జాయింట్‌‌ కమిషనర్‌‌కు లెటర్‌‌ రాశారు. ఏపీ ప్రభుత్వం వైజాగ్‌‌లో బోర్డు హెడ్‌‌ క్వార్టర్స్‌‌ ఏర్పాటుకు ముందుకు వస్తూ లెటర్‌‌ రాసిందని వివరించారు. వైజాగ్‌‌లో బోర్డు ఆఫీస్‌‌కు అవసరమైన అకామిడేషన్‌‌ను గుర్తించగానే మళ్లీ సమాచారమిస్తామని తెలిపిందని పేర్కొన్నారు. అకామిడేషన్​ను ఏపీ గుర్తించగానే బోర్డును వైజాగ్‌‌ షిఫ్ట్​ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బోర్డు షిఫ్టింగ్​కు నిధుల కొరత ఉందని లెటర్‌‌లో పేర్కొన్నారు. 2020 –-21 ఫైనాన్స్​ ఇయర్​కు  నిధులు రిలీజ్‌ చేయాలని రెండు రాష్ట్రాలను పలుమార్లు కోరినా  నిధులు ఇవ్వలేదన్నారు. బోర్డు తరలింపునకు యాక్షన్‌‌ ప్లాన్‌‌ రూపొందించి కేంద్రానికి పంపుతున్నామని, నిధులు సమకూర్చగానే షిఫ్ట్​ చేస్తామన్నారు. తెలంగాణ ప్రమేయం లేకుండానే.. హైదరాబాద్​లో ఉన్న కృష్ణా బోర్డు హెడ్‌‌ క్వార్టర్స్  తరలింపులో తెలంగాణ ప్రమేయం లేకుండానే ప్రాసెస్​ పూర్తయ్యేలా కనిపిస్తోంది. రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌లో ఏపీలో కృష్ణా బోర్డు ఏర్పాటుకు మన సర్కారు అంగీకరిస్తూ కేంద్రానికి లెటర్​ రాసింది. దీంతో హెడ్‌‌ క్వార్టర్స్‌‌ షిఫ్టింగ్‌కు మళ్లీ తెలంగాణను సంప్రదించాల్సిన అవసరం లేదని బోర్డు ఆఫీసర్లు చెప్తున్నారు. విభజన చట్టం ప్రకారం హెడ్‌ఆఫీసు ఏపీలో పెట్టాల్సి ఉన్నా..వైజాగ్‌‌లో ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ తరపున లెటర్‌‌ రాయనున్నట్టు ఇంజనీర్లు చెప్పారు. కోటాకు మించి నీళ్లివ్వండి కోటాకు మించి నీళ్లివ్వాలని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్‌‌ పంపింది. నిర్ణయించిన కోటా ప్రకారం ఏపీకి ఇంకో 95 టీఎంసీలే దక్కాల్సి ఉండగా మార్చి నెలాఖరుకే 108.50 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. వాడుకున్న నీటిలో ఫ్లడ్‌‌ డేస్‌‌లో తీసుకున్న 125 టీఎంసీలను కోటా నుంచి మినహాయించాలంది. ఏపీ ఇరిగేషన్‌‌ ఈఎన్సీ నారాయణరెడ్డి గురువారం కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురేకు లెటర్‌‌ రాశారు. మరోవైపు మార్చి నెలాఖరు వరకు తెలంగాణకు 83 టీఎంసీల నీటిని కేటాయించాలని ఈఎన్సీ మురళీధర్‌‌ గురువారం కేఆర్‌‌ఎంబీకి లెటర్‌‌ రాశారు. నాగార్జునసాగర్‌‌ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ, హైదరాబాద్‌‌ తాగునీటికి 65 టీఎంసీలు, కల్వకుర్తి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టు నుంచి 18 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతివ్వాలని ఇండెంట్‌‌లో కోరారు.