కొవాగ్జిన్​కు కన్సెంట్ అక్కర్లేదు

కొవాగ్జిన్​కు కన్సెంట్ అక్కర్లేదు
  • రాష్ట్రాలకు కేంద్రం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: కొవాగ్జిన్ టీకా తీసుకోవాలంటే కన్సెంట్‌‌ లెటర్‌పై సంతకం చేయాలన్న నిబంధనను కేంద్ర ఆరోగ్య శాఖ రద్దు చేసింది. ఇక ఎవరి దగ్గర కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని అన్ని రాష్ట్రాల చీఫ్‌‌ సెక్రటరీలు, హెల్త్ సెక్రటరీలకు కేంద్రం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం దృష్ట్యా కొవాగ్జిన్‌‌ వినియోగానికి పర్మిషన్ ఇస్తున్నట్టు అప్రూవల్‌‌ లెటర్‌‌‌‌లో పేర్కొన్నారు. 
రాష్ట్రంలో 5,176 మందికి వ్యాక్సిన్
రాష్ట్రంలో గురువారం మరో 5,176 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో 3,810 మంది వృద్ధులు, 36 మంది హెల్త్ వర్కర్లు, 1,330 మంది కోమార్బిడ్ పేషెంట్లు ఉన్నారు. రాష్ట్రంలో ఫస్ట్ డోసు వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య 4,85,471కి చేరగా, ఇందులో 2,06,225 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. ప్రస్తుతం 301 సర్కారు, 181 ప్రైవేట్ సెంటర్లలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మరో 181 మంది కరోనా బారిన పడ్డారు. బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి 8 గంటల వరకు 21,340 మందికి టెస్ట్‌‌ చేయగా గ్రేటర్ హైదరాబాద్‌‌లో 44 మందికి, జిల్లాల్లో 137 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,717కుపెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,139 యాక్టివ్ కేసులున్నాయి. గురువారం వైరస్‌‌తో ఒకరు చనిపోగా.. మృతుల సంఖ్య 1,650కి పెరిగిందని బులెటిన్‌‌లో పేర్కొన్నారు.