హైదరాబాద్సిటీ, వెలుగు : కాంగ్రెస్ పార్టీ సనత్‌నగర్ ఇన్చార్జ్, ఏఐసీసీ మెంబర్ డాక్టర్ కోటా నీలిమ ఆదివారం బెంగళూరులో ఇండియన్ విమెన్ అచీవర్స్ అవార్డు అందుకున్నారు. ఆమెతో పాటు కవిత కృష్ణమూర్తి, శ్రేయా పటేల్, సమీరారెడ్డి, ధన్యా రాజేంద్రన్, పింకీ ఆనంద్, మీనాక్షి అమ్మ తదితరులు ఈ పురస్కారాన్ని పొందారు. ఈ అవార్డు అందుకున్నవారిలో మన రాష్ట్రం నుంచి నీలిమ మాత్రమే ఉన్నారు.