హైదరాబాద్, వెలుగు: కొరియన్ పిజ్జా బ్రాండ్ గోపిజ్జా, మొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. కార్యక్రమానికి నటి మధుశాలిని ముఖ్య అతిథిగా వచ్చారు. గోఓవెన్ అనే రోబో ద్వారా ఇక్కడ పిజ్జాలు తయారు చేస్తారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 100 అవుట్‌లెట్‌లను మొదలుపెడతామని గోపిజ్జా ఇండియా సీఈఓ మహేష్ రెడ్డి చెప్పారు. గోపిజ్జా దక్షిణ కొరియా, సింగపూర్, ఇండోనేషియా, ఇండియా హాంగ్‌కాంగ్‌లలో 200లకు పైగా స్టోర్లతో విస్తరించింది. రాబోయే రెండేళ్లలో రెండు రాష్ట్రాలలో 50 అవుట్‌లెట్లను ప్రారంభించనున్నామని రెడ్డి వివరించారు. ఇటీవల సిరీస్ సీ ఫండింగ్‌లో భాగంగా రూ.200 కోట్లను సమీకరించామని వెల్లడించారు.
