
ఈ జనరేషన్ అమ్మాయిలు, అబ్బాయిలకు.. కొరియన్ డ్రామాలంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కొరియన్ డ్రామాలనే కాదు.. దానిలోని యాక్టర్స్‌ను కూడా అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా.. వాళ్ల గ్లోసీ స్కిన్‌కు ఎట్రాక్ట్ అయిపోతారు. కొరియన్ ముద్దుగుమ్మల చర్మం స్మూత్‌గా, మచ్చలు లేకుండా.. అద్ధంలా మెరిసిపోతూ ఉంటుంది. వాళ్లకంత అందం మేకప్ వల్లే వస్తుందని చాలా మంది అనుకుంటారు. మీరూ ఇలానే ఫీల్ అవుతుంటే.. పొరబడినట్లే. వాళ్ల చర్మం నిజంగానే కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది. కొరియన్ భామల బ్యూటీ వెనక ఉన్న సీక్రెట్.. వాళ్లు పాటించే స్కిన్ కేర్ రొటీన్. కొరియన్స్ సౌందర్య సంరక్షణకు కేవలం.. న్యాచురల్ పదార్థాలు మాత్రమే వాడుతుంటారు. మీరూ కూడా గ్లోసీ స్కిన్ సొంతం చేసుకోవాలంటే.. ఈ ప్యాక్స్ ట్రై చేయండి
1. క్లెన్సింగ్: ముఖం మీద మేకప్, సమస్యలని తగ్గించుకోడానికి వాడే క్లెన్సర్ల్స్ లో క్లెన్సింగ్ ముఖాన్ని శుభ్రంగా అందంగా ఉంచుతుంది.క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత ముఖానికి అప్లై చేసి తరువాత జాగ్రత్తగా కడిగేయాలి. దీని తయారీకి మూడు టీస్పూన్ల పాలు, చిటికెడు పసుపు కలపండి. ఆ తరువాత కాటన్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మంలోని మలినాలను తొలగిస్తుంది.
2. స్టీమింగ్: నీటిని మరిగించి అందులో అలోవెరా జెల్ కలపండి. 10 నిమిషాలు ఆవిరి పడితే.. .చర్మ రంధ్రాలకు అడ్డుపడిన వాటిని తొలగిస్తుంది. అలోవెరా జెల్ చర్మానికి ఉండే జిడ్డును శుభ్రం చేస్తుంది.
3. ఎక్స్ఫోలియేట్: కొద్దిగా కాఫీ పౌడర్ , అలోవెరా జెల్ కలపండి. దీంతో మీ ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. ఎక్స్ఫోలియేట్ చేసుకోవడంతో చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించుకోవచ్చు. వారంలో రెండు మూడు సార్లు స్కబ్రర్తో ఎక్స్ఫోలియేట్ చేయడంతో మంచి ఫలితాలు ఉంటాయి. చర్మాన్ని శుభ్రపరిచే ప్రక్రియలో చనిపోయిన ఉపరితల కణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఒక్కోసారి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల చర్మం మందాన్ని తగ్గించడంతో పాటు ఫేస్ మాస్క్‌లు, ఫేషియల్స్, క్రీమ్‌లు మొదలైన వాటి ప్రయోజనాలను గ్రహించడంలో సహాయపడుతుంది
4. టోనర్ : టీస్పూన్ రోజ్ వాటర్ , అలోవెరా జెల్ కలపండి. దీన్ని మీ ముఖంపై స్ప్రేసి.. 10 నిమిషాల తర్వాత మెత్తని టవల్ తో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం యొక్క pH సమతుల్యతను కాపాడుతుంది. ఆమ్ల స్థితినినెలకొల్పడంతో పాటు చర్మం శుభ్రం చేయబడుతుంది.
5. సీరమ్: టీస్పూన్ అలోవెరా జెల్ , చిటికెడు పసుపు పొడిని కలపండి. అప్లై చేసిన 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది మొటిమలను తగ్గించి.. మీ చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. హార్మోన్ల అసమతుల్యత, పర్యావరణ ఒత్తిళ్లు, పోషకాహారం లేని ఆహారాలు మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్తమ ఆకృతిని కొనసాగించడం చాలా తరచుగా జరుగుతుంది. ఈ అత్యంత సాంద్రీకృత పరిష్కారం యొక్క సమయోచిత అనువర్తనాన్ని ఎంచుకోవడం గొప్పగా సహాయపడుతుంది.
6. షీట్ మాస్క్ : చర్మ సమస్యలను తగ్గించుందేకు వివిధ రకాల క్రీమ్స్, మాశ్చరైజర్స్, మాస్క్ అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కాస్మోటిక్ పరిశ్రమలో వివిధ విషయాలు కనుగొంటున్నాయి. సరికొత్తగా మాస్క్ షీట్ అందుబాటులోకి వచ్చింది బియ్యాన్ని రాత్రంతా నీళ్లలో నాన బెట్టాలి. అందులో కాటన్ షీట్ కూడా ఉంచాలి. ఉదయాన్నే ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది మొటిమలను తగ్గిస్తుంది. .
7. ఐ క్రీమ్ : 1 స్పూన్ అలోవెరా జెల్, 3 చుక్కల కొబ్బరి నూనె కలపండి. మీ కంటి ప్రాంతం కింద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. ఇది మీ కంటి ప్రాంతాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇది కంటి కింద సమస్యలు, నల్లటి వలయాలు, ఉబ్బరం , మరిన్నింటితో వ్యవహరించే వ్యక్తులకు రక్షకునిగా పనిచేస్తుంది. అయినప్పటికీ, మీ కంటి క్రీమ్ నుండి గరిష్ట ప్రయోజనాలను పొందడానికి సరైన పద్ధతి.
8. మాయిశ్చరైజర్ : చర్మాన్ని తేమగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు క్రీమ్ లేదా జెల్ మాయిశ్చరైజర్‌ను అప్లై చేయవచ్చు.2 చుక్కల బాదం నూనెతో 1 స్పూన్ అలోవెరా జెల్ కలపండి. అప్లై చేసి రాత్రంతా ఉంచండి. పొడి చర్మం ఉన్నవారు ఈ క్రీమ్ మాయిశ్చరైజర్లను ,జిడ్డు చర్మం ఉన్నవారు జెల్ మాయిశ్చరైజర్లను ఉపయోగించవచ్చు. ఇవి చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ, ముడతలు తగ్గించడానికి ఉపయోగపడతాయి.