అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు ప్రమాణస్వీకార చేశారు. జనసేన అధ్యక్షులు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణాస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణాస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.సినీ ఇండస్ట్రీ నుండి రజినీకాంత్ సతీసమేతంగా హాజరు కాగా, మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్ హోదాలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇదిలా ఉండాగా, ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.