ప్రసాదం తయారీలో నాణ్యత పాటించాలి

  • దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్ స్పెక్టర్ విజయలక్ష్మి

జగదేవపూర్, వెలుగు: కొండపోచమ్మ ఆలయ ప్రసాదం తయారీలో  నాణ్యతా పాటించాలని దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్ స్పెక్టర్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ ఆలయం వద్ద బహిరంగ వేలం నిర్వహించారు. లడ్డు, పులిహోర టెండర్​తీగుల్ నర్సాపూర్ కి చెందిన ప్రశాంత్ రూ.26.30లక్షలకు, ఆలయం ముందు పూల దండలు అమ్ముకొను హక్కును రూ.16వేలకు సత్యనారాయణ, షాప్​ నెంబర్ 4ను పోచయ్య రూ.72వేలకు దక్కించుకున్నారు. 

ఈ సందర్భంగా డివిజనల్ ఇన్ స్పెక్టర్ మాట్లాడుతూ.. లడ్డూ, పులిహోరలో నాణ్యత పాటించకుంటే డిపాజిట్ రద్దు చేస్తామని తెలిపారు. టెండర్ల ద్వారా రూ.27.80లక్షల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. జనవరి 13 నుంచి అమ్మవారి జాతర ప్రారంభమవుతుందని ఈ నేపథ్యంలో ఆలయాన్ని రంగులతో అందంగా అలంకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రవికుమార్, సీనియర్ అసిస్టెంట్ మహేందర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ రజిత రమేశ్, సిబ్బంది కనకయ్య, హరిబాబు, మాజీ చైర్మన్ లక్ష్మి నరసింహ రెడ్డి, డైరెక్టర్లు నరేశ్, వజ్రమ్మ రఘుపతి పాల్గొన్నారు.