ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C--–DAK) మధ్య పరస్పర ఒప్పందం జరిగింది. గురువారం రాజేంద్రనగర్ లోని క్యాంప్ ఆఫీసులో హార్టికల్చర్వైస్ చాన్స్లర్ దండా రాజిరెడ్డి, సీ డాక్డైరెక్టర్ లక్ష్మీ ఈశ్వరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పరివర్తనను పెంపొందించడం అన్నారు. స్థిరమైన ఉద్యాన పద్ధతులను ప్రోత్సహించడానికి, సామాజిక ఆర్థిక పురోగతికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు రిజిస్టర్ భగవాన్, సురేశ్ కుమార్, అనిత, ప్రశాంత్, సైదయ్య పాల్గొన్నారు.