కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో  శుక్రవారం అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించారు. 73 రోజుల హుండీ ఆదాయం  రూ.81,68,044, అలాగే 146 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 200 గ్రాముల మిశ్రమ వెండి, 26 నోట్ల విదేశీ కరెన్సీ, 5 క్వింటాళ్ల 50 కిలోల మిశ్రమ బియ్యం వచ్చినట్లు ఈవో బాలాజీ శర్మ తెలిపారు.

కార్యక్రమంలో సిద్దిపేట వేంకటేశ్వర స్వామి ఆలయ ఈవో విశ్వనాథ శర్మ, కొమురవెల్లి ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్, ఆలయ ధర్మకర్తలు శ్రీనివాస్, లక్ష్మీ, జయప్రకాశ్ రెడ్డి, శ్రీనివాస్, మోహన్ రెడ్డి, రాజు, ఎస్ఐ రాజు గౌడ్, ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకుడు శ్రీరాములు, సురేందర్ పాల్గొన్నారు.

నల్ల పోచమ్మ హుండీ ఆదాయం రూ.5.98 లక్షలు

కౌడిపల్లి : మెదక్​జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని తునికి నల్ల పోచమ్మ ఆలయ హుండీని శుక్రవారం లెక్కించగా రూ.5.98 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఇన్​చార్జి ఈవో రంగారావు తెలిపారు. ఉమ్మడి మెదక్​జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు.  హుండీ ద్వారా  వచ్చిన ఆదాయాన్ని దేవాదాయశాఖ ఖాతాలో జమ చేసి ఆలయ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ చారి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, సిబ్బంది రాజు, అశోక్ ఉన్నారు.