డ్రగ్స్ ట్రాఫికింగ్ వ్యవహారంలో ప్రముఖ నటుడి తనయుడు అరెస్ట్..

పలు కోలీవుడ్ సినిమాలలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు మన్సూర్ అలీఖాన్. మన్సూర్ అలీఖాన్ ఈ మధ్య తనసినిమాలతోనే కాదు వివాదాలతోనూ బాగానే వైరల్ అవుతున్నాడు. అయితే మన్సూర్ అలీఖాన్ తనయుడు అలీ ఖాన్ తుగ్లక్‌తో పాటు మరో తొమ్మిదిమంది మాదకద్రవ్యాల అక్రమ రవాణా  కేసులో అరెస్ట్ అయ్యారు.

పూర్తివివరాల్లోకి వెళితే డిసెంబర్ 3న డ్రగ్ సిండికేట్‌లో కీలక సభ్యుడు జిదాన్ జుబీన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో నటుడు మన్సూర్ ఆలీకి ఖాన్ తనయుడు అలీ ఖాన్ తుగ్లక్ తోపాటు మరో 9మంది వ్యక్తులకి డ్రగ్స్ సప్లయ్ వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. 

దీంతో పోలీసులు అలీ ఖాన్ తుగ్లక్‌తో సహా పది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఏడుగురిని తమిళనాడులోని అంబత్తూరు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే తుగ్లక్ ముఠా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తోందని ఈ క్రమంలో మన్నాడికి చెందిన మహమ్మద్‌, జయముజీన్‌లు ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు కోర్టుకి వెల్లడించారు. 

ALSO READ : జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ కార్ యాక్సిడెంట్..

మహమ్మద్‌, జయముజీన్‌లు ఎక్కువగా కాలేజీ స్టూడెంట్స్, అలాగే ధనికుల పిల్లలని టార్గెట్ చేస్తూ డ్రగ్స్ అమ్మేవారు. అలాగే డబ్బు ట్రాన్సాక్షన్స్ కోసం జీపే, ఫోన్ పే వంటి యాప్స్ వినియోగించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఈ కేసుని మరింత లోతుగా విచారిస్తున్నారు. అయితే డ్రగ్స్ వివాదంలో మన్సూర్ అలీ ఖాన్ తనయుడు అరెస్ట్ కావడంతో రెండసార్లు జైలుకి వెళ్లి తుగ్లక్ ని కలిశాడు. దీంతో ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.