ఢిల్లీలో కొల్లాపూర్ మామిడి ప్రదర్శన

కొల్లాపూర్, వెలుగు: నాగర్ కర్నూల్  ఫార్మర్  ప్రొడ్యూసర్  ఆర్గనైజేషన్  ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మామిడి మేళాలో కొల్లాపూర్ మామిడిని ప్రదర్శించారు. హార్టికల్చర్​ జాయింట్  డైరెక్టర్  బాబు, డిప్యూటీ డైరెక్టర్  విజయ ప్రసాద్,  జిల్లా హార్టికల్చ్​ ఆఫీసర్లు​చక్రపాణి, కమల మేళాను ప్రారంభించారు. 

ఢిల్లీలో జిల్లా మామిడికి మంచి డిమాండ్, మార్కెటింగ్  అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఫార్మర్  ప్రొడ్యూసర్  కంపెనీ డైరెక్టర్లు, మామిడి రైతులు పాల్గొన్నారు.