IPL 2025: శ్రేయాస్‌ను పట్టించుకోని కోల్‌కతా.. అయ్యర్‌పై మూడు ఫ్రాంచైజీలు కన్ను

ఐపీఎల్ 2025 కు సంబంధించి రిటైన్ చేసుకునే ప్లేయర్ల సమయం దగ్గర పడుతుంది. అక్టోబర్ 31 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే చివరి తేదీ. మరో నాలుగు రోజుల్లో అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్స్ ను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి ఒక షాకింగ్ వార్త అందినట్టు సమాచారం. అయ్యర్ ను కేకేఆర్ రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని నివేదికలు చెబుతున్నాయి. అయ్యర్ సారథ్యంలోనే కోల్ కతా ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. 

రింకూ సింగ్ తో పాటు వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్లు రస్సెల్, నరైన్ లను రిటైన్ చేసుకోవడం దాదాపుగా ఖాయమైంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ కేటగిరిలో రమణ్ దీప్ సింగ్, హర్షిత్ రాణాల మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. అయ్యర్ ను ఒకవేళ కేకేఆర్ కాదనుకుంటే అతను మూడు ఫ్రాంచైజీలు టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. రాయల్ ఛాలెంజర్ బెంగళూరుతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ అతన్ని మెగా ఆక్షన్ లో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Also Read : వార్నర్‌కు అల్లు అర్జున్ స్పెషల్ విషెస్

ప్రస్తుతం బెంగళూరు,ఢిల్లీ, పంజాబ్ జట్లకు సరైన కెప్టెన్ లేడు. ఫాఫ్ డుప్లెసిస్ ను ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోతే ఖచ్చితంగా కెప్టెన్ కోసం  అయ్యర్ ను టార్గెట్ చేయొచ్చు. మరోవైపు ఢిల్లీ జట్టుతో పంత్ కొనసాగాడనే వార్తలు వస్తున్నాయి. అతను తప్పుకుంటే అయ్యర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో అయ్యర్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ కు సైతం సరైన కెప్టెన్ కోసం వెతుకుతుంది. ధావన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటచడంతో పంజాబ్ అతన్ని నమ్ముకునే స్థితిలో లేదు. ఆఫ్హే జరిగితే అయ్యర్ పై గురి పెట్టొచ్చు.