పానీ పూరి అంటే ప్రతీఒక్కరు ఇష్టంగా తింటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు పానీపూరి బండి కనబడితే వదిలిపెట్టరు. అంత ఇష్టంగా తినే పానీ పూరి కల్తీ గురించి ఎన్ని వార్తలొచ్చినా సరే ఎవరు పట్టించుకోరు. తాజాగా ఈ తరహా ఇన్సిడెంట్ ఒకటి వెలుగులోకి వచ్చింది.
ముంబైలోని కొల్హాపూర్ ప్రాంతం రాన్ కలా లేక సమీపంలో “ముంబైకి స్పెషల్ పానీ పూరి వాలా” పేరుతో ఓ వ్యక్తి పానీ పూరి బిజినెస్ చేస్తున్నాడు. అసలే రద్దీ ప్రాంతం కావడంతో సాయంత్రం అయ్యిందంటే కష్టమర్లు కిటకిటలాడుతుంటారు. దీన్నే క్యాష్ చేసుకునేందుకు సదరు వ్యాపారి తన దుర్భుద్దిని బయటపెట్టాడు. పానీ పూరి బండి సమీపంలో పబ్లిక్ టాయిలెట్ ఉంది. ఆ టాయిలెట్ వాటర్ ను పానీపూరిలో వాడే రసానికి వినియోగించాడు. ఓ నెటిజన్ పానీపూరి వ్యాపారి చేస్తున్న తతంగాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు వైరల్ కావడంతో ఆగ్రహానికి గురైన స్థానికులు ఆ పానిపూరి బండిని ధ్వంసం చేశారు. వ్యాపారిని చితకబాదారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
