Virat Kohli: కస్టమర్ల ప్రాణాలకు రక్షణేది.. కోహ్లీ రెస్టారెంట్‌కు నోటీసులు

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఫైర్‌ సేఫ్టీ విషయంలో సదరుశాఖ నుంచి NOC తీసుకోకుండా అలానే నడుపుతోన్న కోహ్లీకి చెందిన 'One8 కమ్యూన్' పబ్ అండ్ రెస్టారెంట్‌కు బెంగళూరు మహానగర పాలక సంస్థ(BBMP) నోటీసులు జారీ చేసింది. సామాజిక కార్యకర్తలు హెచ్‌ఎం వెంకటేష్‌, కుణిగల్‌ నరసింహమూర్తి ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేశారు.

ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని బీబీఎమ్‌పీ అధికారులు తెలిపారు. యాజమాన్యానికి ఏడు రోజుల గడువు ఇచ్చారు. స్పష్టత ఇవ్వకపోతే బీబీఎంపీ చట్టపరమైన చర్యలు తీసుకోనుంది. 

ALSO READ | Robin Uthappa: నన్నూ మోసం చేశారు.. అరెస్ట్ వారెంట్ పై స్పందించిన ఊతప్ప

ఈ ఏడాది జూలైలో ఇదే రెస్టారెంట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిబంధనలు అతిక్రమించి అర్ధరాత్రి 1, 2 గంటల వరకూ కస్టమర్లకు సేవలందిస్తున్నట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ రెస్టారంట్ చిన్నస్వామి స్టేడియం సమీపంలోని రత్నం కాంప్లెక్స్‌లోని ఆరవ అంతస్తులో ఉంది.