ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య మిస్టరీగా మారింది. కోడెల మరణం ఆత్మహత్య కాదన్నారు ఆయన మేనల్లుడు కంచేటి సాయి. కోడెల కుమారుడు శివరాం.. ఆస్తి కోసం తన తండ్రి కోడెల శివప్రసాదరావును హత్య చేశాడని సంచలన ఆరోపణ చేశారు మేనల్లుడు కంచేటి సాయి. తండ్రినే చంపి… ఆత్మహత్యగా క్రియేట్ చేశాడని ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీకి కంప్లయింట్ చేశారు.
కోడెల శివప్రసాదరావును… ఆయన కొడుకు శివరాం కొన్నాళ్లుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని చెప్పారు కంచేటి సాయి. ఈ విషయాన్ని పలుమార్లు తనకు ఫోన్ చేసి స్వయంగా కోడెల శివప్రసాదరావు గతంలో చెప్పాడని అన్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కోడెలకు లేదని అన్నారు. కోడెల శివప్రసాదరావు మృతిపై పూర్తిస్థాయిలో పోలీసు విచారణ జరగాలని ఆయన కోరారు.
