కాంగ్రెస్​లో చేరిన కొడంగల్ బీఆర్ఎస్ నేతలు

  • కండువాలు కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్​రెడ్డి

కొడంగల్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి సొంత సెగ్మెంట్ కొడంగల్ లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఆదివారం హైదరాబాద్ లో సీఎం రేవంత్​రెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జ్ తిరుపతిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్​మండల అధ్యక్షుడు ప్రమోద్​రావు, ఎంపీపీ విజయ్​కుమార్, పీఏసీఎస్​చైర్మన్ వెంకట్​రెడ్డి, మాజీ జడ్పీటీసీ మోహన్​రెడ్డి, ఎంపీటీసీలు జనార్దన్​గౌడ్, రవీందర్​రెడ్డి, మాజీ సర్పంచ్ అంజద్​తో పాటు దాదాపు 300 మంది కార్యకర్తలు కాంగ్రెస్ ​లో చేరారు. వారికి సీఎం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.