ఏపీ మంత్రి కోడాలి నాని,మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లు సవాల్ ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. దేవినేనిపై కోడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. ‘దేవినేని ఉమా..నీ కంటే బ్రోకర్లు ఎవరైనా ఉన్నారా? వదిన్ని చంపి ఎమ్మెల్యేవయ్యావు. నేను రాజకీయాల్లో లేకుంటే నిన్ను చెప్పు తీసుకుని కొట్టేవాడిని. మంచి మర్యాద లేకుండా జగన్‌పై నోరు పారేసుకుంటే నా చేతుల్లోనో, కేపీ చేతుల్లోనో, వంశీ చేతుల్లోనే తన్నులు తినక తప్పదు. ప్రెస్ మీట్‌లు పెట్టి కుక్కలా మొరుగుతావు.. నేరుగా ఫోన్ చేసి తిడితే మాట్లాడవు. నీ ఇంట్లో నైనా చర్చకు వస్తా. చంద్రబాబు ఏం చేశాడో, జగన్ ఏం చేశాడో తేల్చుకుందాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే.. నా సవాల్ స్వీకరించు. పిచ్చి వాగుడు మానకుంటే నీ ఇంటికొచ్చి బడిత పూజ చేయకుంటే నా పేరు కొడాలి నానినే కాదు’ అని నాని సవాల్ విసిరారు.
కోడాలిని నాని వ్యాఖ్యలకు దేవినేని ఉమా ప్రతి సవాల్ విసిరారు.‘ దమ్ముంటే రండి. ప్రజల ముందే తేల్చుకుందాం రండి. నువ్వు వస్తావో, లేక సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తారో రండి. ఎవరూ టచ్ చేస్తారో టచ్ చేసి చూడండి. చిల్లర మాటలు మాట్లాడే నువ్వు అసలు మంత్రివేనా. పేకాట, కోతాట ఆడిస్తూ అడ్డంగా దొరికిపోయిన నువ్వు గొల్లపూడి వచ్చి పిచ్చి వాగుడు వాగుతావా. తంతాం.. పొడుస్తాం, బడిత పూజ చేస్తాం.. నరికేస్తాం.. అంటూ చిల్లర వ్యాఖ్యలు చేస్తావా? ప్రభుత్వానికి కానీ, మంత్రికి కానీ, జగన్‌కు కానీ దమ్ముంటే రండి తేల్చుకుందాం’ అని అన్నారు.
see more news
కాళేశ్వరంలో భారీ అవినీతి.. కొన్నది 1686 కోట్లు..లెక్కల్లో చూపించింది 7348 కోట్లు
‘పోలీసులు కండువా లేని టీఆర్ఎస్ నాయకులు‘
భారత్ సంచలన విజయం.. కంగారూలను చితగ్గొట్టిన పంత్, గిల్
టీమిండియాకు రూ.5 కోట్ల భారీ నజరానా
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
