ఇవే నాకు చివరి ఎన్నికలు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను: కోడాలి నాని

ఏపీ మాజీ మంత్రి కోడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు 2024 ఎన్నికలే  చివరివని.. వచ్చేఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. ప్రస్తుతం తన వయసు 53 వచ్చే ఎన్నికల వరకు 58 ఏళ్లు వస్తాయి..ఆ వయసులో ఎన్నికల్లో పోటీచేయలేనని అన్నారు. తన కుటుంబాల్లో ఎవరికీ రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. తన కూతుళ్లకు పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ లేదన్నారు. వస్తే తన తమ్ముడి కొడుకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 

ALSO READ :- నేను గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ మూసేస్తారా: బండి సంజయ్

గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న  నానికి ఈ సారి జగన్ టికెట్ ఇవ్వడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. గుడివాడ టికెట్ మండలి హనుమంతరావుకు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మరి ఏది నిజమో చూడాలి.