రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

మునగాల, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం మండలంలోని బరాకత్ గూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. సెంటర్లకు ధాన్యం తీసుకొచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతుల సౌకర్యార్థం కాంగ్రెస్ ప్రభుత్వం వరి కోతలకు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. 

మద్దతు ధరతోపాటు ప్రభుత్వం రూ.500 బోనస్ కూడా చెల్లిస్తుందని చెప్పారు. అనంతరం కోదాడ, చిలుకూరు, అనంతగిరి మండలాల్లో  ఏర్పాటు చేసిన ఐకేపీ, సొసైటీల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, పీఏసీఎస్​ చైర్మన్ సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి బి.రాజు, ఎంపీడీవో రమేశ్ దీన్ దయాల్, ఆర్ఐ రామారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జైపాల్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు సామేల్, నాయకులు రవి, ఎన్.శ్రీనివాస్, కోటేశ్వరరావు, జానకిరెడ్డి, స్టాలిన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు.