ఆయుధాలు చూడొచ్చు, సైన్యం గురించి తెలుసుకోవచ్చు.. గోల్కొండ కోటలో ‘Know Your Army’ మేళా

దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ పౌరులందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైన్యం గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భారత సైన్యం దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి..? పహారా కాసే సమయంలో సైనికులు వాడే ఆయుధాలేంటి..? సైన్యం సంబాషించుకునే కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా ఉంటుంది..? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో మెదులుతుంటాయి. అవన్నీ తెలుసుకునే సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. 

జనవరి 3 నుండి 5 వరకు హైదరాబాద్‌లోని గోల్కొండ కోట వేదికగా ఇండియన్ ఆర్మీ 'నో యువర్ ఆర్మీ(Know Your Army)' మేళా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో ఆర్టిలరీ గన్‌లు, చిన్న చిన్న ఆయుధాలు, కమ్యూనికేషన్ సిస్టమ్‌లు, ఇంజనీరింగ్ సాధనాలు, న్యూక్లియర్ బయోలాజికల్- కెమికల్ (NBC) వార్‌ఫేర్ సూట్‌లు వంటి ప్రధాన పరికరాల ప్రదర్శించనున్నారు.

ALSO READ | 2025లో కోటీశ్వరులు కావటం ఎలా: ఈ 15 మ్యూచువల్ ఫండ్స్ లో ట్రై చేయండి..!

భారతీయ సైన్యం గురించి, సైన్యం సాంకేతిక నైపుణ్యం గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, సాయుధ దళాలలో చేరాలనుకునే యువతకు ఏమైనా సందేహాలుంటే ఆర్మీ సిబ్బందితో ఇంటరాక్టివ్ అయ్యి నివృత్తి చేసుకోవచ్చు.