IND vs AUS: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రోహిత్‌ శర్మ మోకాలికి గాయం

ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టుకు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది. నెట్స్‌లో త్రోడౌన్ స్పెషలిస్ట్ దయాను ఎదుర్కొనే క్రమంలో రోహిత్‌ ఎడమ మోకాలికి బంతి బలంగా తగినట్లు సమాచారం. వెంటనే ఫిజిషయన్ ఐస్‌ ప్యాక్‌తో రోహిత్ మోకాలికి మర్ధన చేశారు. ఆ తరువాత హిట్ మ్యాన్ తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే, అతను గాయం తీవ్రత ఏంటనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.

తీవ్ర ఒత్తిడిలో హిట్‌మ్యాన్.. 

ఇదిలావుంటే, బాక్సింగ్ డే టెస్టుకు ముందు రోహిత్ శర్మ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అతని పేలవ ఫామ్ అందుకు ప్రధాన కారణం. ఈ ముంబై బ్యాటర్ చివరి పది ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధ సెంచరీ సాధించాడు. దాంతో, హిట్ మ్యాన్ తనకు తానుగా తప్పుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు, నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో కేఎల్‌ రాహుల్‌ గాయపడ్డాడు. బంతి అతని కుడిచేతికి బలంగా తగలడంతో నొప్పితో విలవిలలాడి పోయాడు. అయితే అతని గాయం అంత తీవ్రమైనది కానట్లు తెలుస్తోంది. ప్రాథమిక చికిత్స అనంతరం అతను తిరిగి ప్రాక్టీస్ కొనసాగించినట్లు సమాచారం. 

ALSO READ | Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన

బాక్సింగ్‌ డే టెస్ట్‌ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. మెల్ బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.