పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ వైఫల్యంతో పాటు దురదృష్టం వెక్కిరించింది. మంచి టచ్ లో కనిపించిన కేఎల్ రాహుల్ థర్డ్ అంపైర్ తప్పిదం కారణంగా పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 23 ఓవర్ రెండో బంతిని ఔట్ స్వింగ్ విసిరాడు. ఈ బంతిని రాహుల్ డిఫెన్స్ చేయడంతో అది కాస్త మిస్ అయ్యి వెళ్లి వికెట్ కీపర్ క్యారీ చేతిలో పడింది. బ్యాట్ కు బంతి చాలా దగ్గరగా వెళ్లడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ రివ్యూ కోరాడు.
బంతి లైవ్ లో చూస్తుంటే క్లియర్ గా తగలనట్టు కనిపిస్తుంది. మరో యాంగిల్ లో బ్యాట్ కు బంతి చాలా దగ్గరలో వెళ్తున్నట్టు అనిపించింది. థర్డ్ అంపైర్ స్నికోలో చూడగా.. అక్కడ బ్యాట్ కు బంతి తగిలినట్టు చూపించింది. దీంతో థర్డ్ అంపైర్ రాహుల్ ను ఔట్ గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయానికి రాహుల్ మాత్రం షాకవుతూ నిరాశగా పెవిలియన్ కు చేరాడు. రాహుల్ ఔట్ పై థర్డ్ అంపైర్ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ లో 74 బంతుల్లో3 ఫోర్లతో రాహుల్ 24 పరుగులు చేసి ఔటయ్యాడు.
Also Read:-మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది.. మార్చిలోనే ఐపీఎల్ ప్రారంభం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు లంచ్ సమయానికి మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజ్ లో పంత్ (10), జురెల్ (4) ఉన్నారు. ఫామ్ లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మూడో ఓవర్ లో పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. పడికల్ పరుగు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. 23 బంతుల్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరాడు. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ 5 పరుగులు చేసి స్లిప్ లో దొరికిపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్, స్టార్క్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024
- Unlucky, KL. ? pic.twitter.com/lf0UOWwmy8