KL Rahul: శుభవార్త చెప్పిన అతియా శెట్టి.. తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్

భారత బ్యాటర్/ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతని సతీమణి అతియా శెట్టి శుక్రవారం(నవంబర్ 8) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాను గర్భం దాల్చినట్లు.. వచ్చే ఏడాది(2025) బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అథియా ఇన్‌స్టాగ్రామ్ అభిమానులకు తెలియజేసింది. దాంతో, ఈ జంటకకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

కాగా, బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి కుమార్తె అయిన అథియాశెట్టిని రాహుల్ 2023 జనవరిలో వివాహమాడాడు. మూడేళ్ల ప్రేమాయణం అనంతరం వీరి ప్రేమ పట్టాలెక్కింది. ప్రస్తుతం రాహుల్ బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. భారత్‌-ఎ, ఆస్ట్రేలియా-ఎ మధ్య జరుగుతున్న రెండో అనధికార టెస్టులో ఆడుతున్నాడు.