తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్టుకు అందుబాటులో ఉండడంతో అడిలైడ్ టెస్టుకు ఓపెనర్లు ఎవరనే విషయంలో కొంత గందరగోళం జరిగింది. పెర్త్ టెస్టులో బాగా ఆడిన రాహుల్ ను బ్యాటింగ్ ఆర్డర్ మార్చితే అతని ఆత్మవిశ్వాసం కోల్పేయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తన స్థానాన్ని త్యాగం చేశాడు. రెండో టెస్టుకు రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపాడు. తాను మాత్రం ఏ స్థానంలో బ్యాటింగ్ ఆడతాడనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.
రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. నేను ఎక్కడైనా బ్యాటింగ్ చేయవచ్చని హిట్ మ్యాన్ అన్నాడు. పెర్త్ లో రోహిత్, జైశ్వాల్ జోడీ ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం చూసి థ్రిల్ అయ్యానని ఈ సందర్భంగా హిట్ మ్యాన్ తెలిపాడు. రోహిత్ మాటలను బట్టి చూస్తుంటే మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిల్ మిడిల్ ఆర్డర్ లో ఆడలేడు కాబట్టి అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయం. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఈ రకంగా చూసుకుంటే రోహిత్ 5 లేదా 6 స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నాడు. టెస్ట్ కెరీర్ ప్రారంభంలో రోహిత్ 5 లేదా 6 స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చేవాడు.
ALSO READ : ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తా..తుది జట్టులో చోటు ఉంటే చాలు-కేఎల్ రాహుల్
తొలి టెస్టులో గెలిచిన తర్వాత టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఒకరకంగా చూసుకుంటే రెండో టెస్టుకు మరింత బలంగా కనిపిస్తుంది. తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు శుభమాన్ గిల్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం ఖాయమైంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్ట్ జరగనుంది. మరోవైపు పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత ఆస్ట్రేలియా ఒత్తిడిలో కనిపిస్తుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలుపు అత్యంత కీలకం.
? KL RAHUL TO OPEN IN THE PINK BALL TEST...!!! ?
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 5, 2024
- Rohit Sharma confirms he'll bat in the middle order. pic.twitter.com/PtVXDWtUQS