ఐపీఎల్లో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?

ఐపీఎల్లో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?

ముంబై: ఐపీఎల్‌‌‌‌లో పాల్గొనే ఆటగాళ్లే కాదు అభిమానులూ ఫేమస్‌‌ అవుతారనే దానికి మరో ఉదాహరణ.  బ్రబౌర్న్‌‌ స్టేడియంలో  ఆదివారం సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌‌–కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌ మ్యాచ్‌‌కు వచ్చి టీవీలో కనిపించిన ఓ అమ్మాయి ఇప్పుడు మస్తు ఫేమస్‌‌ అయ్యింది.  కేకేఆర్‌‌, ఆ టీమ్‌‌ కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌కు సపోర్ట్‌‌గా స్టాండ్స్‌‌లో వైట్‌‌ టాప్‌‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మను కెమెరామెన్‌‌ చాలా సార్లు స్క్రీన్‌‌పై చూపించారు.  కుల్దీప్‌‌ యాదవ్‌‌ అద్భుత రిటర్న్‌‌ క్యాచ్‌‌తో ఉమేశ్‌‌ యాదవ్‌‌ను ఔట్‌‌ చేసిన సందర్భంలోనూ స్క్రీన్‌‌పై ఈ అమ్మాయే కనిపించింది. దాంతో, ఆమెను కాకుండా మ్యాచ్‌‌ను చూపించాలంటూ ఫ్యాన్స్‌‌ సోషల్‌‌ మీడియాలో  బ్రాడ్‌‌కాస్టర్‌‌పై సెటైర్లు వేశారు. ఇంత అందంగా ఉన్న ఈ అభిమాని పేరు ఆర్తి బేడి. ఆమె నటి, డాన్సర్‌‌. కొన్ని యాడ్స్‌‌లో నటించింది. అప్పటిదాకా ఆమె గురించి కొద్ది మందికే తెలుసు. కానీ, మ్యాచ్‌‌లో కనిపించిన తర్వాత ‘ఎవరీ మిస్టరీ గర్ల్’ అంటూ ఆర్తి ఫొటోలను చాలా మంది నెట్​లో షేర్​ చేసి  ఫేమస్‌‌ చేశారు. ఈ దెబ్బకు మ్యాచ్‌‌కు ముందు ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఆర్తి బేడికి 29 వేల మంది ఫాలోవర్లు ఉంటే.. ఒక్కరోజు తిరగకుండానే ఫాలోవర్లు డబుల్‌‌ అయ్యారు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.

మరిన్ని వార్తలు