జనవరి 26న ఢిల్లీలో కిసాన్ గణతంత్ర నిర్వహించనున్నట్లు స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్ ప్రకటించారు. 26వ తేదీలోగా రైతుల డిమాండ్లను నెరవేర్చకుంటే ఢిల్లీలో కిసాన్ గణతంత్ర నిర్వహిస్తామన్నారు. ఇందు కోసం దేశ వ్యాప్తంగా ప్రతి రైతు కుటుంబం నుంచి ఒకరు హస్తిన రావాల్సిందిగా కోరుతామని ఆయన తెలిపారు.
అగ్రి చట్టాల రద్దు డిమాండ్ తో ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు తమ ఆందోళనను ఉధృతం చేయనున్నారు. జనవరి 23న దేశంలోని వివిధ రాష్ట్రాలలో గవర్నర్ నివాసాలకు మార్చ్ నిర్వహిస్తామని, ట్రాక్టర్లతో 26న కిసాన్ పరేడ్ నిర్వహిస్తామని కాంగ్రి కారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ తెలిపారు.
