KAMovie: 'క' ట్విట్టర్ రివ్యూ.. కిరణ్ అబ్బవరం సినిమాకు టాక్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) విభిన్నంగా సింగిల్ లెటర్ 'క'(KA)టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇవాళ గురువారం అక్టోబర్ 31న థియేటర్లలోకి వస్తోన్న ఈ సినిమాలో కిరణ్ సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు.

అయితే.. నిన్న బుధవారం సాయంత్రమే (అక్టోబర్ 30న) 'క' మూవీ ప్రీమియర్ షోలు పడ్డాయి. మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఈ సినిమా చూసిన నెటిజన్లు ఎక్స్ ద్వారా తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. పీరియాడిక్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ టాక్ ఎలా ఉందో.. కిరణ్ కెరీర్ కి ఎలాంటి ప్లస్ కానుందో రివ్యూలో చూద్దాం.

హీరో కిరణ్ అబ్బవరం హిట్ కొట్టేశారని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రెండు ట్విస్టులు అదిరిపోయాయని చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. క మూవీ కాన్సెప్ట్ బాగుందని.. డైరెక్టర్లు సుజిత్, సందీప్ మంచి కథతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారని అంటున్నారు. ఇక ఈ ఇద్దరు డైరెక్టర్స్ క్లైమాక్స్‌ తీసిన విధానం మైండ్ పోతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

క మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్.. సెకండాఫ్ సూపర్.. ముఖ్యంగా చివరి 20 నిముషాలు గూస్బంప్స్ అంతే. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బెస్ట్ ఇచ్చాడు. సామ్ సీఎస్ అందించిన మ్యూజిక్ అద్దిరిపోయింది. BGM ఏం కొట్టాడు స్వామి.. కుదాస్. కెమెరా పనితనం అద్భుతం. #KA2: కోసం ఎదురు చూస్తూ!! అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. 

క మూవీ బ్యాక్ డ్రాప్..కేరేక్టర్స్, సాంగ్స్ బాగున్నాయి. ఇంటర్వల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండాఫ్ లో వచ్చే కోర్టు ఫైట్, జాతర సాంగ్, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఫైట్ , కొత్తగా చెప్పిన క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్. కిరణ్ అబ్బవరం ఎంచుకున్న టెక్నీషియన్స్ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. అందరికీ మంచి పేరు రావడం ఖాయం. సామ్ సీఎస్ అందించిన మ్యూజిక్ సస్పెన్స్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసాయని.. తనదైన బీజీఎమ్ తో కుమ్మేసాడని.. ఓవరల్ గా సినిమా బాగుందని.. కిరణ్ కు హిట్ పక్కా అని ఓ నెటిజన్ ట్వీట్ చేసాడు. 

క మూవీ ఎంగేజింగ్ థ్రిల్లర్. ఈ సినిమాకు మ్యూజిక్ బిగ్గెస్ట్ అసెట్. హీరో వాసుదేవ్ పాత్రలో కిరణ్ అబ్బవరంను డిఫరెంట్‌గా చూస్తారు. ఫస్టాఫ్‌లో ఇంట్రడక్షన్ సీన్, మంచి పాటలు, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నాయి. సెకండాఫ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్, జాతర సాంగ్, క్లైమాక్స్ ఎడ్ల బండి ఎపిసోడ్ బాగున్నాయి. ఈ సినిమా ఓవరాల్‌గా బ్లాక్ బస్టర్ అటెంప్ట్ అని చెప్పవచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

క మూవీ స్టోరీలైన్‌ విషయంలో డైరెక్టర్‌ను మెచ్చుకోవాల్సిందే. సింపుల్‌గా ఫస్టాఫ్ సాగిపోతూ ఇంటర్వెల్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్‌తో గూస్బంప్స్ తెప్పించారు. సెకండాఫ్ ఎంగేజింగ్‌గా ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్బ్‌గా ఉంది. మ్యూజిక్ సినిమాకు పాజిటివ్‌గా మారిన అంశాల్లో ఒకటి. ట్విస్టులు, మంచి నేరేషన్‌తో థ్రిల్ చేసే క ను తప్పకుండా చూడాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

క మూవీ క్లైమాక్స్ సూపర్‌గా ఉంది. సినిమాలో ట్విస్ట్ ఎవరూ కూడా గెస్ చేయలేరు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం బ్యాక్ వచ్చాడు. ఆయన కెరీర్‌లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా ఆయన జర్నీలో బెస్ట్ సినిమా. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మూవీ కాన్సెప్ట్ బాగుంది. డైరెక్టర్లు సుజిత్, సందీప్ మంచి కథతో సినిమాను అందించారు. క్లైమాక్స్‌ తీసిన విధానం మైండ్ పోతుంది అని నెటిజన్ అన్నాడు.

‘క’ చిత్రంలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఊపేసిందని నెటిజన్లు అంటున్నారు. సామ్ సీఎస్ అందించిన మ్యూజిక్ సీన్లను ఎలివేట్ చేసిందని, సస్పెన్స్‌ఫుల్‍గా అనిపించిందని కామెంట్లు చేస్తున్నారు.ప్రమోషన్లలో కిరణ్ చెప్పినట్టు ఈ చిత్రం కొత్తగా ఉందని, ట్విస్టులు కూడా ఊహలకు అందకుండా ఉన్నాయంటూ కొందరు ట్వీట్లు చేశారు.