Dilruba: ప్రేమ అనేది మోస్ట్ అడిక్ట్ డ్రగ్..ఆసక్తిగా కిరణ్ అబ్బవరం దిల్ రూబా కాన్సెప్ట్ వీడియో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో హిట్ కొట్టి తన సత్తా చూపించాడు. ఇపుడు 'దిల్ రూబా' అంటూ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు  వస్తున్నాడు. తాజాగా ఇవాళ జనవరి 2న దిల్ రూబా కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. దిల్ రూబా `హిజ్ యాంగ‌ర్‌.. హిజ్ ల‌వ్‌` అనేది ఉప‌శీర్షిక‌.

ఈ సినిమా టీజర్ ను రేపు (జనవరి 3న) రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా దిల్ రూబా స్టోరీ థీమ్ ఏంటనేది చూపించే ప్రయత్నంలో ఓ వీడియో రిలీజ్ చేశారు.  ఈ హీరో కిరణ్ అబ్బవరం ఓ నది ఒడ్డున కూర్చుని మాట్లాడుతున్న కాన్సెప్ట్ వీడియో ఆసక్తిగా ఉంది.

Also Read:-రాజమౌళి ప్రెస్ మీట్ ఉంటుందా..

"డియర్ అమ్మాయిలు, అబ్బాయిలు నా పేరు సిద్దు.. సిద్ధార్ద్. నా ప్రేమను పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చా. ప్రేమ విషయంలో అప్పుడే పూటైనా చంటి పిల్లాడి నుంచి అరవై ఏళ్ల ముసలవ్వ వరకు అందరికి ప్రేమను చెప్పడానికి వచ్చా. ఎందుకంటే, అమ్మ కడుపులో పుట్టిన తర్వాత మొదట మనం తీసుకునేది అమ్మ ఇచ్చే ప్రేమే. ఈ ప్రపంచంలో ప్రేమ అనేది మోస్ట్ అడిక్ట్ డ్రగ్. అలాంటి ప్రేమను మీకు పరిచయం చేయడానికి ‘దిల్ రూబా’ తో మీ ముందుకు వస్తున్నా అంటూ వీడియో రిలీజ్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కిరణ్ అబ్బవరం జోడిగా రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ కలిసి నిర్మిస్తున్నారు. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌‌‌‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నారు.