ఏపీ ఫైబర్ నెట్ స్క్రీన్‌పై జగన్ ఫొటో ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై హోరాహోరిగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సీఈఓకు లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఫైబర్ నెట్ స్క్రీన్ పై జగన్ ఫోటో పెట్టడం ఎన్నిక నియమావళికి విరుద్ధమని అచ్చెన్నాయిడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అలాగే ఎన్నికల తేదీలు ప్రకటించినా వ్యూహం మూవీని అదేపనిగా ప్రసారం చేస్తున్నారని, వెంటనే నిలిపి వేయాలని ఈసీని టీడీపీ నేతలు లేఖ ద్వారా  కోరారు. జగన్ ఫొటో తొలగించాలని ఫైబర్ నెట్ అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కోరారు.