
షెన్‌జెన్ (చైనా): ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తొలి ఎడిషన్‌లో సెమీఫైనల్ చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 12వ ర్యాంకర్ లక్ష్య 10–21, 21–13, 21–13తో చైనాకు చెందిన అంగస్ క లాంగ్‌పై విజయం సాధించాడు. తొలి గేమ్ కోల్పోయినా గొప్పగా పుంజుకున్న ఇండియా ఆటగాడు తర్వాతి రెండు గేమ్స్‌లో తిరుగులేని ఆటతో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు.