మంచుతో కప్పేసిన పయేక్టు పర్వతంపై నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ తెల్ల గుర్రంపై స్వారీ చేశారు. ఈ పర్వతం కిమ్ వంశానికి స్పిరిచ్యువల్‌గా ఎంతో ముఖ్యమైందని చెబుతారు. కిమ్ స్వారీ చేసిన ఫొటోలను ఆదేశానికి చెందిన న్యూస్ ఏజెన్సీ ‘కేసీఎన్‌ఏ’ బుధవారం రిలీజ్ చేసింది. ప్రమాదకరమైన పర్వతం ప్రాంతంలో గుర్రపు స్వారీని కిమ్ బాగా ఆస్వాదించినట్టు ఆయన సహాయకులు చెప్పారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే టైమ్‌లోనే కిమ్ ఇలాంటి సాహస యాత్రలు చేస్తారట. ఈ సారి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో మరి!

